Header Banner

పాకిస్థాన్ ప్రధానికి భారత్ ఝలక్! యూట్యూబ్ ఛానల్‌ను నిషేధించిన కేంద్రం!

  Fri May 02, 2025 19:15        India

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను భారత్‌లో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ ఛానల్‌ను భారత్‌లో చూడటానికి ప్రయత్నిస్తే, "జాతీయ భద్రత లేదా శాంతిభద్రతలకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కారణంగా ఈ కంటెంట్ మీ దేశంలో అందుబాటులో లేదు" అనే సందేశం కనిపిస్తోంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన కొద్ది రోజులకే ఈ చర్య తీసుకోవడం గమనార్హం.

అంతకుముందు కూడా రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ను, భారత్‌కు, భారత భద్రతా దళాలకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలపై 16 ప్రముఖ పాకిస్థానీ యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. వీటిలో డాన్, సమా టీవీ, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్, బోల్ న్యూస్ వంటి ప్రధాన వార్తా సంస్థల ఛానళ్లు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి 'ఎక్స్' ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిదిలకు చెందిన ఛానళ్లపై కూడా చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రిది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇదివరకే బ్లాక్ చేసింది.

ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaVsPakistan #YouTubeBan #ShehbazSharif #NationalSecurity #PahalghamAttack #DigitalStrike #IndiaStrong #PakMediaBan